తీహార్ జైలుకు అఫ్తాబ్.. ఢిల్లీ కోర్టు ఆదేశాలు

by Disha Web Desk 7 |
తీహార్ జైలుకు అఫ్తాబ్.. ఢిల్లీ కోర్టు ఆదేశాలు
X

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సంచలనం రేపిన శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పునవాలాను కోర్టు జ్యుడిషియలీ కస్టడీ విధించింది. శనివారం జరిగిన విచారణలో ఢిల్లీ పోలీసులు కస్టడీ గడువు పొడిగించాలని కోరగా, అందుకు నిరాకరించింది. వచ్చే నెల 8వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అతడిని తీహార్ జైలుకు తరలించనున్నారు. అంబేడ్కర్ ఆసుపత్రి నుంచి అఫ్తాబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హజరయ్యాడు.

ప్రస్తుతం అతడికి పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించగా, సోమవారం నార్కో టెస్టు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2019 నుంచి శ్రద్ధాతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ ఈ ఏడాది మేలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఆమెను హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా మృతదేహాన్ని 35 ముక్కలు చేసి, వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. ఇది కాస్తా తాజాగా వెలుగుచూడటంతో పోలీసులు అఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పే సమాధానాలు సరిగ్గా లేకపోవడంతో నార్కో టెస్ట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.



Next Story