అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారం కీలక మలుపు

by Disha Web Desk 2 |
అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారం కీలక మలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను దుమారం రేపుతున్న అంశంపై పూర్తి స్థాయిలో అధ్యయనం కోసం సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నందన్ నీలేకని, కేవి.కామత్, సోమశేఖరన్ సుందరేశన్ ఇతర సభ్యులుగా ఉంటారని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

రెండు నెలల్లో సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఈ కమిటీ ఏర్పాటు విషయంలో కమిటీ సభ్యుల పేర్లను కేంద్రం సీల్డ్ కవర్‌లో పేర్కొనడాన్ని గత విచారణలో సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిపుణుల కమిటీని తామే నియమిస్తామని తెలిపింది. ఆ మేరకు ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు నెలల పాటు అధ్యయనం చేయనుంది. స్టాక్ ఎక్చ్ ఛేంజ్, హిండెన్ బర్గ్ నివేదికలో పేర్కొన్న అంశాలు, షేర్ల కొనుగోలు, విక్రయాల అంశాల్లో అంతర్గతంగా, బహిర్గతంగా ఏం జరుగుతోందనే దానిపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.


Next Story

Most Viewed