నోట్ల కట్టలపై నిద్రించిన పొలిటికల్ లీడర్.. ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా వ్యవహారం!

by GSrikanth |
నోట్ల కట్టలపై నిద్రించిన పొలిటికల్ లీడర్.. ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా వ్యవహారం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ఓ రాజకీయ నాయకుడు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. రూ.500 నోట్ల కట్టలపై నిద్రించి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. అస్సాంకు చెందిన రాజకీయ నాయకుడు బెంజామిన్ బసుమతరీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని పంజాబ్‌కు చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) షేర్‌ చేసింది. ఒంటిపై దుస్తులు లేకుండా పడుకొని.. పరుపునిండా నోట్ల కట్టలు చల్లుకున్నారు. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రభుత్వ పథకాల్లో అవినీతికి పాల్పడి.. లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నట్లు ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఆయన కరెన్సీ నోట్ల కట్టపై నిద్రిస్తున్న ఫొటో వైరల్ కావడంతో అందరి దృష్టి ఆయనపై పడింది. ప్రస్తుతం ఆయన ఉదల్‌గురి జిల్లా భైరగురిలో VCDC ఛైర్మన్‌గా ఉన్నారు.




Next Story

Most Viewed