‘‘నన్ను ఓ ఇంటివాడిని చేసి పుణ్యం కట్టుకోండి సార్’’

by Disha Web Desk 19 |
‘‘నన్ను ఓ ఇంటివాడిని చేసి పుణ్యం కట్టుకోండి సార్’’
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ గ్రామాల్లో కానీ, వీధుల్లో కానీ, వివిధ సమస్యల మీద తమకు సాయం చేయాలని కోరుతూ ప్రభుత్వాధికారులకు, రాజకీయ నాయకులకు జనాలు లేఖలు రాయడం చూస్తుంటా. కానీ ఓ వ్యక్తి మాత్రం విభిన్నమైన అంశంతో సీఎం ఆఫీసుకు రాసిన ఓ లేఖ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఆ వ్యక్తి రాసిన లేఖను చూసి.. అధికారులు కంగుతిన్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అంతగా ఆ లేఖలో ఏం రాశాడంటే.. తనకో పెళ్లి కూతురు కావాలని అడిగాడు. ఇంట్లో సమస్యల వల్ల ఒంటి మీదకు 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదని, తనను ఓ ఇంటివాడిని చేసి పుణ్యం కట్టుకోవాలని కోరాడు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని దౌసా జిల్లా బహరవాండా బ్లాక్‌లోని ద్రవ్యోల్బణ సహాయ శిబిరంలో శనివారం ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి సహాయక శిబిరానికి సిక్రాయ్ సబ్‌డివిజన్‌లోని గంగాద్వాడి గ్రామానికి చెందిన కల్లు మహ్వర్(40) అనే వ్యక్తి లేఖ రాశాడు.

తనకు 40 ఏళ్లని, ఇంకా పెళ్లి కాలేదని, ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని.. ఇంటి బాధ్యతలు నిర్వహించలేక ఇబ్బంది పడుతున్నానని అందులో పేర్కొన్నాడు. తనకో అమ్మాయిని వెతికిపెడితే పెళ్లి చేసుకుని స్థిరపడతానని కోరాడు. అంతేకాదు, తనకు భార్యగా రాబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలనూ మహ్వర్ అందులో పేర్కొన్నాడు.

తనకు కాబోయే భార్య తప్పనిసరిగా సన్నగా ఉండాలని. నాయకత్వ లక్షణాలు ఉండాలని.. న్యాయంగా వ్యవహరించడంతో పాటు అమ్మాయి వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని కోరాడు. వీలైనంత త్వరగా తన ఇంటికి ఒక ఇల్లాలిని అందించాలని వినతి చేశాడు. ఈ లేఖ దుబ్బి గంగద్వాడి నుంచి వచ్చిందన్నారు.

ప్రస్తుతం ఈ లేఖకు సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఆసక్తికరమైన విషయం ఏంటంటే సహాయక శిబిరంలోని తహశీల్దార్ హరికిషన్ సైనీ.. మహ్వర్‌కు తగిన జీవిత భాగస్వామిని చూసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించాలని కోరుతూ పట్వారీకి దరఖాస్తును ఫార్వార్డ్ చేశారు.



Next Story

Most Viewed