యూపీలో సీరియల్ కిల్లర్ కలకలం

by Disha Web Desk 10 |
యూపీలో సీరియల్ కిల్లర్ కలకలం
X

బరేలీ: వరుస హత్యలతో యూపీలో ఓ సీరియల్ కిల్లర్ మహిళలను భయపెడుతున్నాడు. గత కొన్ని నెలలుగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పలువురు మహిళలు హత్యకు గురవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళ్తే, ఈ ఏడాది జూన్ నుంచి నగరంలో తొమ్మిది మంది మహిళలు హత్యకు గురయ్యారు. దాంతో స్థానిక పోలీసులు మహిళలను ఇంటరిగా బయటకు వెళ్లవద్దని, లేదంటే గుంపులుగా ఉండమని సూచించారు. పలు ప్రాంతాల్లో తనిఖీలను పెంచిన పోలీసులు పలు ప్రాంతాల్లో నిఘా పెంచి సీరియల్ కిల్లర్ కోసం వెతుకుతున్నారు. నగరంలోని షాహి, ఫతేగంజ్ వెస్ట్, షీష్‌గఢ్ ప్రాంతాల్లో గడిచిన కొన్ని నెలల్లోనే చాలా కేసులు నమోదయ్యాయి. బాధితులు ఎక్కువగా 50 నుంచి 65 సంవత్సరాల వయసువారు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మహిళలందరినీ గొంతు కోసి చంపారని, వారి మృతదేహాలు పొలాల్లో కనిపించాయని పోలీసులు వివరించారు. హత్యకు గురైన వారందరూ ఎలాంటి దోపిడీకి, లైంగిక వేధింపులకు గురైనట్టు లేదని వెల్లడించారు. నగరంలో స్థానికులు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టం చేశారు. పోలీసులు ఎనిమిది మది అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి, నగరమంతా పెట్రోలింగ్ పెంచారు. కొంతమంది మహిళల పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉందని, దీని తర్వాత మరింత సమాచారంతో హంతకుడిని పట్టుకుంటామని బరేలీ ఎస్పీ పేర్కొన్నారు.

Next Story

Most Viewed