Nitin Gadkari: 9 లక్షల ప్రభుత్వ వాహానాలు తుక్కుకే..

by Disha Web Desk 7 |
Nitin Gadkari: 9 లక్షల ప్రభుత్వ వాహానాలు తుక్కుకే..
X

న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లు దాటిన 9 లక్షల వాహానాలను ప్రభుత్వ వాహానాలను తుక్కు కిందకు వెళ్తాయని అన్నారు. వాటి స్థానంలో కొత్త వాహానాలు వస్తాయని చెప్పారు. సోమవారం పారిశ్రామిక సంస్థ ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 15 ఏళ్ల పూర్తైన 9లక్షలకు పైగా వాహానాలను తుక్కుగా మార్చేందుకు కేంద్రం ఆమోదించింది.

వీటి స్థానంలో కొత్త వాహానాలు ప్రత్యామ్నాయ ఇంధనాలతో వస్తాయి' అని అన్నారు. ఈ చర్యలతో వాయు కాలుష్యం కాస్తా తగ్గుతుందని చెప్పారు. ఈథనాల్, మిథనాల్, బయో సీఎన్ జీ, బయో-ఎల్‌ఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహానాలను ప్రభుత్వ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు. తుక్కుగా వెళ్లే జాబితాలోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాహానాలు, ప్రజా రవాణాకు వాహానాలు వస్తాయని వెల్లడించారు.

అయితే ప్రత్యేకంగా(రక్షణ శాఖ) ఉపయోగించే వాహానాలకు మాత్రం ఈ నియమం వర్తించదని ప్రకటనలో పేర్కొన్నారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పాలసీ వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల తర్వాత, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ పరీక్షలను అందిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విధానం ప్రకారం, పాత వాహనాలను రద్దు చేసిన తర్వాత కొనుగోలు చేసిన వాహనాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రోడ్డు పన్నుపై 25 శాతం వరకు పన్ను రాయితీని అందిస్తామని కేంద్రం తెలిపింది.


Next Story

Most Viewed