40 ఏళ్లుగా ‘సియాచిన్’‌పై పహారా.. మన ఆర్మీ బలాలివీ

by Dishanational4 |
40 ఏళ్లుగా ‘సియాచిన్’‌పై పహారా.. మన ఆర్మీ బలాలివీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి ‘సియాచిన్‌’. భారత సైన్యం ‘ఆపరేషన్ మేఘదూత్’ ద్వారా 1984 ఏప్రిల్ 13న ‘సియాచిన్‌’‌పై పూర్తి నియంత్రణ సాధించింది. శనివారంతో అక్కడికి భారత సైన్యం చేరి సరిగ్గా 40 ఏళ్లు పూర్తయ్యాయి. మన దేశంలోని కారాకోరం పర్వత శ్రేణిలో దాదాపు 20వేల అడుగుల ఎత్తులో సియాచిన్ హిమానీనదం ఉంది. ఆ యుద్ధభూమిలో భారత సైనికులకు ప్రధాన శత్రువులు.. ఎముకలు కొరికే చలి, ఈదురు గాలులు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులకు నెలవుగా ఉండే సియాచిన్‌కు భారత ఆర్మీ గత 40 ఏళ్లుగా ఒకే విధమైన రీతిలో కట్టుదిట్టమైన పహారా ఇస్తుండటం మామూలు విషయమేం కాదు. ఈక్రమంలో మన సైన్యానికి అత్యాధునిక సైనిక సాంకేతికత దన్నుగా నిలుస్తోంది.

స్పెషల్ ఫుడ్.. స్పెషల్ దుస్తులు

ప్రత్యేకించి సియాచిన్‌లో డ్యూటీ చేసే సైనికులకు ఆహారం, మందులు, వాహనాలు, దుస్తులు వంటి వాటిని అత్యవసర పరిస్థితుల్లో అందించడానికి సైనిక హెలికాప్టర్లు, డ్రోన్లను వాడుతున్నారు. కొన్ని వారాలైనా ఏ మాత్రం స్వచ్ఛతను కోల్పోని స్పెషల్ ఫుడ్‌ను సియాచిన్‌లో డ్యూటీ చేసే సైనికులకు అందిస్తున్నారు. వీరికి అందించే యూనిఫామ్ కూడా అత్యంత శీతల వాతావరణంలోనూ చెక్కుచెదరకుండా ఉండగలదు. సైనికుల కోసం టెలీ మెడిసిన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.

‘హాపో’ ఛాంబర్లు

సియాచిన్ గ్లేసియర్ కారాకోరం పర్వతశ్రేణిలో చాలా హైట్‌లో ఉంటుంది. ఈ పర్వతశ్రేణిలో దిగువన ఉండే భాగాల్లో అత్యవసర వైద్యచికిత్సా కేంద్రాలను ఆర్మీ ఏర్పాటు చేసింది. అక్కడ సైనికులకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందిస్తుంటారు. ముఖ్యమైన సర్జరీలన్నీ చేస్తుంటారు. ‘హాపో’ అంటే ‘హై ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడెమా’. సియాచిన్‌లో డ్యూటీ చేసే సైనికులకు ‘హాపో’ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. దీనివల్ల శ్వాసలోపం వస్తుంది. ఊపిరితిత్తులలో ద్రవాలు పేరుకుపోతాయి. కారాకోరం పర్వతశ్రేణి దిగువ భాగంలోని ఆస్పత్రుల్లో ప్రత్యేక హాపో ఛాంబర్లు కూడా ఉన్నాయి. ఇక ‘వీశాట్ టెక్నాలజీ’ పుణ్యమా అని సియాచిన్ గ్లేసియర్‌లో డ్యూటీ చేసే సైనికులకు కూడా ఇంటర్నెట్ వసతి అందుబాటులోకి వచ్చేసింది.

Next Story

Most Viewed