2023 యూపీఎస్సీ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగమ్మాయి

by Disha Web Desk 5 |
2023 యూపీఎస్సీ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగమ్మాయి
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 2023 లో విడుదల అయిన నోటిఫికేషన్ కు యూపీఎస్సీ బోర్డు ఫలితాలు విడుదల చేసింది. ఇందులో మొత్తం 1016 మందిని ఎంపిక చేయగా.. ఆదిత్య శ్రీ వాస్తవ మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్ కు రెండవ ర్యాంకు సాధించారు. మూడవ ర్యాంకు సాధించిన దోనూరు అనన్య రెడ్డి తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్ జిల్లా వాసి కాగా.. దాదాపు 30 మంది తెలుగు విద్యార్ధులు అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. ఇక ఈ ఫలితాల్లో జనరల్ కేటగిరిలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 115 మంది, ఓబీసీ లో 303, ఎస్సీ కేటగిరి 165, ఎస్టీ కేటగిరీలో 86 మంది ఎంపిక అయ్యారు. ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.


Next Story