Coromandel express accident:14 ఏళ్ల క్రితం ఇదే శుక్రవారం.. అదే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ విషాదం

by Disha Web Desk 12 |
Coromandel express accident:14 ఏళ్ల క్రితం ఇదే శుక్రవారం.. అదే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 233 మంది మృతి చెందారు. అలాగే మరో 900 మంది వరకు గాయపడ్డారు. పది సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత ఘోరమైన సంఘటన జరగలేదని అధికారులు తెలుపుతున్నారు. అయితే సరిగ్గా 14 సంవత్సరాల క్రితం.. ఇదే శుక్రవారం రోజున కోరమాండల్ ఎక్స్ ప్రెస్ విషాదం జరగ్గా దాన్ని బ్లాక్ ఫ్రైడే గా పిలిచారు. ఈ ప్రమాదం.. 2009లో రైలు జాజ్‌పూర్ రోడ్ రైల్వే స్టేషన్ గుండా అత్యంత వేగంతో వెళుతుండగా ప్రమాదం జరిగింది.

ఒరిస్సాలోని జాజ్‌పూర్ జిల్లాలో హౌరా నుండి చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోని 13 బోగీలు రైలు ట్రాక్ మారుతుండగా పట్టాలు తప్పడంతో 13 బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో నాటు దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోగా.. 161 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కూడా సరిగ్గా శుక్రవారం సాయంత్రం 7:30 నుంచి 7:40 గంటల మధ్య జరిగింది. పట్టాలు తప్పిన 13 బోగీల్లో 11 స్లీపర్‌ క్లాస్‌, రెండు జనరల్‌ బోగీలు ఉన్నాయి. సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత అదే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, మరో రెండు రైళ్లు ప్రమాదానికి గురికావడంతో దీన్ని డేంజర్ బ్లాక్ ఫ్రైడే గా పిలవడం మొదలు పెట్టారు.

Next Story

Most Viewed