- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్.. సీఈసీ సమీక్ష
దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈనెల 19న దేశంలోని 21 రాష్ట్రాల పరిధిలో ఉన్న 102 లోక్‌సభ స్థానాల్లో జరగనుంది. ఇందులో 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీసు పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈసందర్భంగా వారందరితో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ స్టేషన్‌లలో ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని ఎన్నికల అధికారులను వారు ఆదేశించారు. ప్రలోభాలకు తావు లేకుండా ఓటింగ్ జరిగేలా చూడాలన్నారు. శాంతిభద్రతలను పటిష్టంగా పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్లు పోషించాల్సిన పాత్ర గురించి ఈసందర్భంగా చెప్పారు. సీ-విజిల్, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, సక్షం యాప్, ఎన్‌కోర్, సువిధ యాప్‌ల ప్రాధాన్యాన్ని సీఈసీ రాజీవ్ వివరించారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిస్టిక్స్ నిఘా బృందాలు, వీడియో వీక్షణ బృందాలు సమన్వయంతో ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు.