పొగాకు నియంత్రణ చట్టాలను కఠినం చేయాలి

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: పొగాకు నియంత్రణ పట్ల చట్టాలను కఠినంగా అమలు చేయాలని, అవసరమైతే పొగాకును నిషేధించాలని జనం గళమెత్తారు. బుధవారం రీసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ (ఆర్సీటీసీ) ఆధ్యర్యంలో పొగాకు రహిత తరం కోసం విద్యా సంస్థల పాత్ర అన్న అంశం పై జాతీయ స్థాయి చర్చ జరిగింది. ఈ సందర్భంగా భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ మాట్లాడుతూ.. పొగాకు రహిత సమాజం అందరి ఆశయమన్నారు. రెండు దశాబ్దాలుగా ధూమపానం హానికరం అని చేస్తున్న తన కృషిని వివరించారు. దేశ వ్యాప్తంగా 900మంది జూమ్ ఆప్ ద్వారా పాల్గొన్న ఈ కార్యక్రమం యూ ట్యూబ్ లో లైవ్ గా ప్రసారం చేశారు. తెలంగాణ లోని ఆయా జిల్లాల విద్యా అధికారులు ముందుగానే సమాచారం అందించి పొగాకు, ధూమపానం అలవాటు, వాటి నియంత్రణ పట్ల ఆసక్తి ఉన్న వారిని ఈ సందర్భంగా పాల్గొనేట్టు చేశారు.



Next Story

Most Viewed