ఉచితంగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ కోర్సు @నాస్కామ్

by  |
ఉచితంగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ కోర్సు @నాస్కామ్
X

దిశ వెబ్ డెస్క్: కంప్యూటర్ చదివే విద్యార్థులు.. ఎప్పటికప్పడు అప్ డేట్ అవుతూ ఉండాలి. మార్కెట్ లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులను నేర్చుకుంటూనే భవిష్యత్తులో రూల్ చేయబోయే కోర్సుల గురించి తెలుసుకోవాలి. ప్రస్తుత లాక్ డౌన్ పీరియడ్ ను అందుకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). ఇప్పటికే అనేక ఉద్యోగాల్లో ఇది భాగమైంది. భవిష్యత్తు అంతా ఏఐ దేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఏఐ ఫౌండేషన్ కోర్సును నాస్కామ్ ఉచితంగా నేర్పిస్తుంది. మే 15 వరకు ఈ కోర్సును అందిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పదం. రోజు రోజుకు కొత్త ఆవిష్కరణలకు వేదికగా మారుతోంది టెక్నాలజీ రంగం. అందులో భాగంగా పుట్టుకొచ్చిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇది కీలకంగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్…అనేది ఒకరకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్. సాధారణంగా మనం ఫోన్ లో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు…ఆ వర్డ్ ని ముందే సజెస్ట్ చేస్తుంది. గూగుల్ మనం ఏదీ సెర్చ్ చేసినా, దానికి సంబంధించిన యాడ్ లు మాత్రమే డిస్ ప్లే అవుతుంటాయి. మన ఆలోచన, ఆసక్తిని బట్టి మనకు కావాల్సిన డేటాని ఏఐ అందిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ట్యూమర్ డిటెక్షన్ ఇలా ఎన్నిటికో ఏఐ మార్గం చూపింది. ఇలా అన్ని రంగాల్లో ప్రాధాన్యమున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సును ఉచితంగా అందిస్తోంది నాస్కామ్. Sఫ్యూచర్‌ స్కిల్స్‌, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా మే 15 వరకు ఈ కోర్సును అందించనున్నాయి.

కోర్సులో ఏముంటాయి:

ఇంట్రడక్షన్ టూ ఏఐ, ఎస్ క్యూఎల్ అండ్ రిలేషనల్ డేటాబేసెస్, పైథాన్ ఫర్ డేటా సైన్స్, అల్గారిథమ్స్, స్టాటిస్టిక్స్, డేటా విజువలైజేషన్ విత్ పైథాన్ ఇలా మొత్తంగా ఆరు కోర్సులుంటాయి. థియరీ, ప్రాక్టికల్ రెండు అంశాలుంటాయి. ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిలో చేరడానికి ప్రత్యేక అర్హతలు ఏమీ అవసరం లేదు. టెక్నాలజీపై ఆస్తకి ఉన్న విద్యార్తులు, ఐటీ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ ఎవరైనా అప్లయ్ చేస్తుకోవచ్చు. దీని ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని నాస్కామ్‌ సూచించింది. వివరాలకు fslearning.nasscom.in వెబ్ సైట్ ను చూడండి.

tags : lockdown, nasscom, future skills, electronics and it ministry

Next Story

Most Viewed