విడుదల రోజే వివాదంలో 'నారప్ప'..?

by  |
narappa trailer released
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో విక్టరీకి కేరాఫ్ అడ్రెస్స్ గా మారిపోయాడు వెంకటేష్. ఆ విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్న వెంకీ మామ తాజాగా ‘నారప్ప’ చిత్రంలో విశ్వరూపాన్ని చూపించాడు. అమెజాన్ ప్రైమ్ లో సోమవారం విడుదలైన ‘నారప్ప’ విజయ డంఖాను మోగిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం వివాదంలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తమిళ్ చిత్రం ‘అసురన్’ రీమేక్ గా తెరకెక్కిన ‘నారప్ప’ టేకింగ్ పరంగా మంచి మార్కులనే కొట్టేసింది. ఇక వెంక్కటేష్ నటన సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది ధనుష్ నటనతో వెంకీ మామ నటనను పోల్చినప్పటికీ.. మరికొంతమందికి మాత్రం ఒరిజినలే నచ్చిందని అంటున్నారు. ఇక ఈ సినిమా వివాదానికి కారణం ఏంటంటే.. నారప్ప చిత్రం మొత్తం రాయలసీమ నేపథ్యంలోనే జరుగుతుంది.. భాష, యాస, పేర్లు అన్ని ఆ ప్రాంతానికి చెందినట్లుగానే చూపించారు. అదే వివాదానికి దారి తీసింది.

‘అసురన్’ కొన్ని యదార్థ ఘటనలతో తీసిన చిత్రం. తమిళనాడు లో తక్కువ కులం వారిని పెద్ద కులం వారు ఎంతలా హింసించేవారో, ఎంత తక్కువచేసి మాట్లాడేవారో చూపిస్తూ.. కనీసం చెప్పులు వేసుకుని నడిచినా కూడా వాళ్లను కుక్కలను కొట్టినట్టే కొట్టేవారన్నట్లు చూపించాడు దర్శకుడు వెట్రి మారన్. ఇక ‘నారప్ప’ విషయానికొస్తే తెలుగు నేటివిటీ కి తగట్టు తీశారు తప్ప కథను ఏమి మార్చలేదు. ఇప్పుడు అదే వివాదంగా మారనుంది అంటున్నారు విశ్లేషకులు. మన దగ్గర ఇలాంటి కథ చేయాలనుకున్నపుడు కొన్ని మార్పులు చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా సీమ ప్రాంతంలో ఇలాంటి కల్చర్ ఎప్పుడూ లేదని, రాయలసీమలో ఎవరు, ఎవరిని తక్కువ చేసి చూడలేదని, ఇప్పుడు ఈ చిత్రంలో అలా చూపిస్తే ఆ ప్రాంతాన్ని తక్కువ చేసినట్లు ఉంటుందని అంటున్నారు. మరిముఖ్యంగా తక్కువ జాతి వాళ్లను కొట్టడం.. చెప్పులు తలపై మోయించడం లాంటివి చేయలేదని అంటున్నారు. మరి ఈ సినిమా వివాదం మాటలతోనే ఆగిపోతుందా..? లేక ఇంకా అగ్గి రాజుకుంటుందా..? అనేది చూడాలి.


Next Story