రేపు అనంతపురానికి నారా లోకేష్ .. జిల్లాలో మొదలైన ఉత్కంఠ

by  |
రేపు అనంతపురానికి నారా లోకేష్ .. జిల్లాలో మొదలైన ఉత్కంఠ
X

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం లో విద్యార్థుల పై పోలీసులు చేసిన లాఠీ చార్జ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక గాయ పడిన విద్యార్థులను పరామర్శించడానికి ఏకంగా నారా లోకేష్ రేపు అనంతపురంలో పర్యటించనున్నాడు. దీంతో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ పర్యటనలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొనకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఎస్ఎస్బీఎన్ కాలేజీ విద్యార్ధులు ఎయిడెడ్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రశాంతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థుల పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో కొంత మంది విద్యార్ధులకు గాయాలు అయ్యయి. ఈ దాడిలో ఓ విద్యార్ధిని తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. నిన్నటి నుంచి ఆ అమ్మాయి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

Next Story