బాలయ్య కుమారుడు ‘ఉప్పెన’ సృష్టిస్తాడా?

by  |
Nandamuri Mokshagna, balakrishna
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో వారుసుల ఎంట్రీల పరంపర కొనసాగుతోంది. అగ్ర హీరోల కుటుంబాల నుంచి ఇప్పటివరకు ఎంతోమంది చిత్ర సీమలో అడుగుపెట్టారు. మరికొందరు ఇంకా వారి వారసులను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జాబితాలోకే వస్తాడు నందమూరి వంశానికి చెందిన మరో వారసుడు మోక్షజ్ఞ. నటసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మహానటడుడు, విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు మొదలుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ వరకూ ఒకరిద్దరు మినహా అందరూ అద్భుతమైన నటులుగా ఎదిగారు. ఇప్పటికే మెగా, అక్కినేని ఫ్యామిలీల నుంచి అనేకమంది హీరోలు వచ్చి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య కసరత్తులు మొదలెట్టినట్టు సమాచారం. మోక్షజ్ఞ సైతం యాక్టింగ్‌లో పట్టు కోసం ఫారెన్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇతర మార్షల్ ఆర్ట్స్ట్, డ్యాన్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. దీంతో 2021లోనే మోక్షజ్ఞ ఎంట్రీ కన్ ఫాం అయిపోయినట్టు తెలుస్తోంది.

అయితే, ఇటీవల ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారిన దర్శకుడు బుచ్చిబాబు సన డైరెక్షన్‌లో మోక్షజ్ఞను ఇండస్ట్రీలో పరిచయం చేయాలని చూస్తున్నాడట బాలయ్య. ఇప్పటివరకూ ఒక కీలకమైన డైరెక్టర్ అనుకున్నా.. ఇప్పుడు కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఫ్యామిలీ ఇటీవల ‘ఉప్పెన’ సినిమాను చూశారు. వారి కుటుంబం కోసం ఉప్పెన చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా షో వేశారు. సినిమా చూసిన అనంతరం బాలయ్య ఎంతో ఆనందపడ్డాడని, మొదటి సినిమాలోనే బుచ్చిబాబు ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అద్భుతంగా డైరెక్ట్ చేశాడని కాంప్లిమెంట్ ఇచ్చినట్టు సమాచారం. చిత్రానికి పనిచేసిన నటీనటులందరినీ ఈ సందర్భంగా బాలయ్య అభినందించారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఎంట్రీని బుచ్చిబాబు చేతుల్లో పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ తర్వాత ఇండస్ట్రీలో ఉప్పెన సృష్టించిన బుచ్చిబాబు, బాలయ్య కుమారుడితో మరో ఉప్పెన సృష్టించబోతున్నట్టు సమాచారం. అయితే మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికే అనేక వార్తలు వచ్చి అభిమాలనులను నిరాశ పర్చిన విషయం తెలిసిందే. మరి ఎతమేరకు నిజం అవుతుందో చూడాలి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed