సెల్ఫీల గోల.. మారిన ఊరి పేరు

by  |
సెల్ఫీల గోల.. మారిన ఊరి పేరు
X

దిశ, వెబ్‌డెస్క్ : వెనకటికి ఎవడో ముఖం బాలేదని అద్దం పగలగొట్టాడట.. ఇక్కడ బాగోలేని ముఖాన్ని బాగు చేయడం సాధ్యం కాదు కాబట్టి అలా చేసి ఉంటాడు. కానీ పేర్ల విషయంలో అలా కాదు, పేరు నచ్చకపోతే దాన్ని మార్చుకొని, అధికారిక గుర్తింపు కూడా పొందవచ్చు. సాధారణంగా ఒక భాషలో పెట్టిన పేర్లు మరో భాష వారికి వింతగా అనిపించవచ్చు. అంతేకాకుండా ఆయా పేర్లకు వారి వారి భాషల్లో వేర్వేరు మీనింగులు ఉండొచ్చు. అలాగే కొన్ని పదాల విషయంలోనూ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఉదాహరణకు మన తెలుగువారి పెళ్లిళ్లలో ‘రండి రండి రండి దయచేయండి’ పాటను ప్లే చేస్తే చాలా గౌరవప్రదంగా ఫీల్ అవుతారు. కానీ ఇదే పాటను నార్త్ ఇండియన్స్ పెళ్లిళ్లలో ప్లే చేస్తే లాగి ఒక్కటిస్తారు. ఇప్పుడు ఈ పేరు గోల, పదాలను తప్పుగా అర్థం చేసుకునే గోల గురించి ఎందుకు చెప్తున్నానంటే.. పేర్లు పలకడంలో తప్పు అర్థం రావడం వల్ల మనుషులు, పాటలకే కాదు గ్రామాలకు కూడా సమస్య ఏర్పడింది.

ఆస్ట్రియాలోని ఓ గ్రామం పేరు ఫ్యూకింగ్. అయితే స్పెల్లింగ్ మాత్రం F***ing అని ఉండేది. గత కొన్నేళ్ల వరకు ఇంటర్నెట్ లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కానీ సోషల్ మీడియా హవాతో ఈ గ్రామం పేరు మార్మోగిపోయింది. ఆ గ్రామం పేరుతో ఎక్కడ బోర్డున్నా దాని పక్కన జనాలు సెల్ఫీలు దిగేవారు. ఆ ఊరి వాళ్లను తప్పుగా కామెంట్ చేసేవారు. అంతేకాకుండా బోర్డులను ఎత్తుకెళ్లిపోయేవారు. ఇలా నానారకాలుగా ఇబ్బందులు పడిన తర్వాత, ఇక వాటిని తట్టుకోలేక ఆ గ్రామం పేరును మార్చాలని మేయర్ ఆండ్రేయా హోల్జనర్ నిర్ణయించుకున్నారు. 1 జనవరి, 2021 నుంచి తమ గ్రామం పేరును ఫుగ్గింగ్ Fugging అని మారుస్తున్నట్లుగా ఆండ్రేయా ప్రకటించారు. ఏదేమైనా పేరు ఇలా ఉంటే నిజంగా దురదృష్టమే కదండీ!

Next Story

Most Viewed