ఏపీతో కేసీఆర్ కుమ్మక్కు: నాగం జనార్దన్

by  |
ఏపీతో కేసీఆర్ కుమ్మక్కు: నాగం జనార్దన్
X

దిశ, న్యూస్‌బ్యూరో : పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఏపీతో కుమ్మకైనా విషయం స్పష్టంగా అర్థమవుతుందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు‌లో తట్టెడు మట్టి తీసినా కేసీఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నాగం జనార్దన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చడమే లక్ష్యమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రులెవ్వరికి వ్యక్తిత్వం లేదని విమర్శించారు. ‘కేసీఆర్‌ను చూస్తేనే వారి లాగులు తడిచే’ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయ భిక్షపెట్టిన మహబూబ్‌నగర్‌కు అన్యాయం చేస్తారా అంటూ నాగం నిలదీశారు. డిసెంబర్ నెలలో ఏపీ ముఖ్యమంత్రి పోతిరెడ్డిపాడు విస్తరిస్తామని ప్రకటిస్తే కేసీఆర్ ఇన్ని రోజులు ఏమీ చేశారన్నారు. అంతేకాకుండా, కృష్ణానది మేనేజ్మెంట్ బోర్డు సబ్ కమిటీ పోతిరెడ్డిపాడు నుంచి 73900 క్యూసెక్కుల నీటిని ఇప్పటికే వినియోగించుకున్నట్లు నివేదిక ఇచ్చిందన్నారు. ఈ నివేదికను సీఎం కేసీఆర్ చూశారా..? అన్ని నాగం ప్రశ్నించారు. పక్క రాష్ట్రం అదనంగా నీళ్లు మళ్లించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటలో సగం కూడా వినియోగించుకోవడం లేదన్నారు. కేసీఆర్‌కు ప్రాజెక్టులకు దేవతల పేర్లు పెట్టి ప్రజల సొమ్ము దోపిడి చేయడం తప్ప ప్రజా ప్రయోజనాలపై పట్టింపు లేదని నాగం జనార్దన్ ఆరోపణలు చేశారు.


Next Story

Most Viewed