తప్పక.. మనసొప్పక.. ఇస్మార్ట్ బ్యూటీ

by  |
తప్పక.. మనసొప్పక.. ఇస్మార్ట్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఇస్మార్ట్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ లైన్లో పెట్టిన భామ… బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న ‘అల్లుడు అదుర్స్‌’లో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లను వాయిదా వేయాలని చిత్ర నిర్మాతల మండలి తెలిపినా… అల్లుడు అదుర్స్ టీం మాత్రం షూటింగ్ కంటిన్యూ చేస్తోందట. ఈ షెడ్యూల్ వాయిదా వేస్తే కాల్షీట్స్ సమస్య వచ్చే అవకాశం ఉండడంతో .. ప్రత్యేక మాస్క్‌లు యూనిట్‌కు అందించి మరీ సినిమా చిత్రీకరణ చేస్తున్నారట.

ఇందులో భాగంగానే హీరోయిన్ నభానటేష్‌ను కూడా ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్‌లో పాల్గొనాలని సూచించిందట మూవీ టీం. దీంతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌లో వాలిపోయిన ఇస్మార్ట్ భామ తప్పక మనసొప్పకపోయినా షూటింగ్‌లో పాల్గొంటుందట. నిబంధనలు ఉల్లంఘిస్తున్నానని తెలిసినా చిత్రీకరణలో పాల్గొనడం తప్పట్లేదట నభాకు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు.

Tags : Nabha Natesh, Ismart Beauty, Alludu Adhurs, Bellamkonda Sai Srinivas



Next Story

Most Viewed