‘పుట్టగొడుగుల వేపుడు’ రెసిపీ

119

శరీరానికి మంచి పోషకాలను అందించే ఆహారాల్లో ఒకటి మష్‌రూమ్స్. ఈ పుట్టగొడుగులను తరచుగా తినడం వల్ల శరీరానికి సరిపడే విటమిన్ డి అందుతోంది. ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న పుట్టగొడుగుల వేపుడును ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు

పుట్టగొడుగులు -250 గ్రాములు
ఉల్లిపాయ -1
పచ్చిమిర్చి -2
టమోటా -1
జీడిపప్పు -20 పలుకులు
ఆవాలు -పావు టీస్పూన్
జీలకర్ర -అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
కారం -1 టీస్పూన్
కరివేపాకు -రెండు రెమ్మలు
గరంమాసాలా -1 టీస్పూన్
నూనె -తగినంత
ఉప్పు -రుచికి సరిపడినంత

తయారీ విధానం :

ముందుగా జీడిపప్పును 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకుని చిటపటలాడేంత వరకు వేగించాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాస పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు వాటిలో పచ్చిమర్చి తరుగు, ఉల్లిపాయలు, టమోటా ముక్కలను వేసుకోవాలి. ఆ మిశ్రమం కొద్దిగా ఉడికిన తర్వాత దానిలో పసుపు, కారం, గరంమసాలా, కరివేపాకు వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో పుట్టగొడుగులు, జీడిపప్పు, రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. సన్నని మంటపై మష్‌రూమ్స్‌ను ఉడికించుకోవాలి. కొంచెం పులుసుగా కూడా కావాలనుకుంటే నిమ్మరసం పిండుకోవచ్చు. పుట్టగొడుగులు ఉడికిన తర్వాత దించేసుకుని సర్వ్ చేసుకుంటే వేడీ వేడీ పుట్టగొడుగుల వేపుడు రెడీ..