జన సంచారానికి బ్రేక్.. కేంద్రం మరో సంచలన నిర్ణయం

by  |
జన సంచారానికి బ్రేక్.. కేంద్రం మరో సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రరూపం దాల్చాయి. ఒక్కరోజు వ్యవధిలోనే రెండు లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదవుతుండటంతో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విధించబోమని ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో జన సంచారం ఎక్కువగా ఉండే ఏరియాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. దీంతో రేపటి నుంచి(శుక్రవారం) భారత్‌లోని అన్ని మ్యూజియంలు, చారిత్రక కట్డడాలను మూసివేయాలని నిర్ణయించింది.

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం మే 15వ తేదీ వరకు పర్యాటక ప్రదేశాలను మూసి ఉంచాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదిలాఉండగా రోజురోజుకూ కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్స్ కూడా సరిపోవడం లేదని సమాచారం. కరోనాను కట్టడి చేయాలంటే ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా జనాలు ఇష్టానుసారంగా సంచరించడం వల్లే కేసులు వేగంగా పెరుగుతున్నాయని వైద్యరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Next Story

Most Viewed