బడుగులపై బల్దియా దాదాగిరి

by  |
door
X

దిశ వికారాబాద్: బడా బాబులు బంగ్లాలు.. వెంచర్లు చేస్తే రెండు కళ్లు మూసుకుంటున్న బల్దియా, బడుగు మహిళలు ఇల్లు కట్టుకుంటే మాత్రం వీధి పోటు ఉందని దర్వాజ కూల్చేశారు. వికారాబాద్ బల్దియాలోని అలంపల్లిలో ఈ సంఘటన జరిగింది. అలంపల్లి 13వ వార్డులో విజయ, కమలమ్మ లకు 50 గజాల స్థలం ఉంది. వృత్తిరీత్యా కూలీ పని చేసుకుంటూ స్థానిక బాలాజీ హాస్పిటల్‌లో ఆయగా పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. పైసా పైసా కూడా పెట్టి సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నారు.

అయితే మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్ మరో వ్యక్తి కలిసి మేము ఇంట్లో లేని సమయంలో నూతనంగా నిర్మించుకున్న ఇంటి దర్వాజను కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతకు మున్సిపల్ సిబ్బంది కారణం ఏంటో చెప్పడం లేదు. రోడ్డుకు వీధి పోటు ఉందని, అందుకే దర్వాజల కూల్చివేస్తామని ఓ నిర్లక్యపు సమాధానం చెబుతున్నారు. మున్సిపల్‌కు సంబంధించిన రోడ్డు ఆక్రమించనప్పటికీ ఇంటి దర్వాజలు కూల్చివేయడం గమనార్హం. ఈ విషయమై కమలమ్మ, విజయమ్మలు కలిసి మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కానీ అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. కాగా, ఈ విషయమై మున్సిపల్ సిబ్బందిని వివరణ కోరగా వారి ఇంటికి ఎదురుగా ఉన్న ప్లాటు యజమాని ఫిర్యాదు మేరకు కూల్చి వేసినట్లు చెప్పుకొచ్చారు. కానీ, వాస్తవంగా మున్సిపల్ సిబ్బందికి మామూలు ముట్ట చెప్పని కారణంగానే ఈ ఇంటి మూతను కారణం లేకుండా తర్వాత కూల్చి వేసినట్లు తెలుస్తుంది. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని ఆ బడుగు మహిళలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి దర్వాజా కూర్చున్న వారిపై చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed