90 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

by Sridhar Babu |
90 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ, అన్నపురెడ్డిపల్లి : అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామ సమీపంలో పక్కా సమాచారం మేరకు పోలీసులు 90 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని (వాటి విలువ సుమారు 1,17000 రూపాయలు) స్వాధీనం చేసుకున్నారు. వీటిని ప్రధాన రహదారిపై డీసీఎం వ్యాన్ లో తరలిస్తున్న క్రమంలో అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మండల పరిధిలోని గుంపెన రేషన్ షాపు నుంచి ఈ రేషన్ బియ్యంను అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్ర శేఖర్ తెలిపారు.

Next Story

Most Viewed