చివరి క్షణాల్లో మరణంపై గూగుల్ సెర్చ్ చేసిన సుశాంత్

by  |
చివరి క్షణాల్లో మరణంపై గూగుల్ సెర్చ్ చేసిన సుశాంత్
X

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన వివరాలను సోమవారం ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్‌ సింగ్ మీడియాకు వెల్లడించారు. సుశాంత్‌కు మాన‌సిక స‌మ‌స్య‌లున్న‌ట్లు అనుమానం వ్య‌క్తం చేశారు. చావ‌డానికి ముందు సుశాంత్.. మ‌ర‌ణం గురించి ఇంట‌ర్నెట్‌లో వెతికిన‌ట్లు తెలిపారు. మానసిక స‌మ‌స్య‌ల గురించి కూడా అత‌ను నెట్‌లో సెర్చ్ చేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ‘పెయిన్‌లెస్ డెత్, షిజోఫ్రేనియా, బైపోలార్ డిజార్డ‌ర్’ లాంటి ప‌దాల‌ను అత‌ను గూగుల్‌లో వెతికిన‌ట్లు అనుమానిస్తున్నారు.

త‌న సొంత పేరును కూడా సుశాంత్ ప‌దే ప‌దే సెర్చ్ చేసిన‌ట్లు చెప్పారు. సుశాంత్‌కు చెందిన‌ మొబైల్ ఫోన్‌, ల్యాప్‌టాప్ నుంచి ఈ విష‌యాల‌ను సేక‌రించిన‌ట్లు క‌మిష‌న‌ర్ వెల్ల‌డించారు. మాజీ మేనేజ‌ర్ దిషా సాలియ‌న్ మ‌ర‌ణం త‌ర్వాత సుశాంత్ భావోద్వేగానికి లోన‌య్యాడు. అత‌ను చాలా మాన‌సికంగా కృంగిపోయిన‌ట్లు క‌మిష‌న‌ర్ తెలిపారు. సుశాంత్ సుమారు 5 లేదా ఆరు మంది డాక్ట‌ర్ల వ‌ద్ద చికిత్స చేయించుకున్న‌ట్లు ప‌ర‌మ్‌బీర్ చెప్పారు. దిషా మ‌ర‌ణానికి త‌న‌కు లింకు ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చూసిన సుశాంత్ అవి త‌ట్టుకోలేక ఇబ్బందిప‌డిన‌ట్లు తెలిపారు. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై సుశాంత్ ఎప్పుడూ జాగ్ర‌త్త‌గా ఉండేవాడ‌న్నారు.

Next Story

Most Viewed