150 పరుగులను SRH ఛేదిస్తుందా?

by  |
150 పరుగులను SRH ఛేదిస్తుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 56వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యావరేజ్ స్కోరు నమోదు చేసింది. టాస్‌ ఒడి బ్యాటింగ్‌‌కు దిగిన రోహిత్ సేన పరుగులు తీయడంలో కాస్త తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 149 పరుగులకే పరిమితం అయింది. ముఖ్యంగా హైదరాబాద్ పేస్ బౌలర్ సందీప్ శర్మ కీలక సమయంలో 3 వికెట్లు తీసుకొని స్కోరును కట్టడి చేశాడు.

ముంబై ఇన్నింగ్స్:
ముంబై తరఫున ఓపెనింగ్ దిగిన రోహిత్ శర్మ (4) పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్వింటన్ డీకాక్ (25) పరుగులు చేసి స్కోర్ బోర్డు 39 వద్ద సందీప్ శర్మ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (36), ఇషాన్ కిషన్ (33) పరుగులతో రాణించారు. కానీ, కృనాల్ పాండ్యా(0) మాత్రం డకౌట్ అయ్యాడు. సౌరబ్ తివారి కూడా ఒక పరుగు చేసి బ్యాట్ వదిలాడు. 36 పరుగులతో రాణిస్తున్న ఇషాన్ కిషన్‌ 115 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ముంబై 6 వికెట్లు కోల్పోయింది.

ఇక ఆ తర్వాత వచ్చిన ఆల్ ‌రౌండర్ పొలార్డ్ 25 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టి 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, చివరి ఓవర్‌లో జాసన్ హోల్డర్ వేసిన బంతికి క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నాథన్ కౌల్టర్ నైల్ 1 పరుగు చేసి వెనుదిరిగాడు. ఇక చివర్లో వచ్చిన జేమ్స్ ప్యాటిన్సన్ (4), ధావల్ కుల్‌కర్ని (3) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు పూర్తియ్యే సరికి ముంబై ఇండియన్స్ 8 వికెట్లను కోల్పోయి 149 పరుగులు చేసింది.

స్కోర్‌ బోర్డ్:

Mumbai Indians Innings: 149-8 (20 Ov)

1. రోహిత్ శర్మ (c)c వార్నర్ b సందీప్ శర్మ 4(7)
2. క్వింటన్ డీకాక్ (wk)b సందీప్ శర్మ 25(13)
3. సూర్య కుమార్ యాదవ్ C వృద్ధిమాన్ సాహ b నదీమ్ 36(29)
4. ఇషాన్ కిషన్ b సందీప్ శర్మ 33(30)
5. కృనాల్ పాండ్యా c విలియమ్సన్ b నదీమ్ 0(3)
6. సౌరబ్ తివారి c వృద్ధిమాన్ సాహ b రషీద్ ఖాన్ 1(3)
7. కీరన్ పొలార్డ్ b హోల్టర్ 41(25)
8. నాథన్ కౌల్టర్ నైల్ c ప్రియమ్ గార్గ్ b హోల్డర్ 1(3)
9. జేమ్స్ ప్యాటిన్సన్ నాటౌట్ 4(5)
10.ధావల్ కుల్‌కర్ని నాటౌట్ 3(2)

ఎక్స్‌ట్రాలు: 1

మొత్తం స్కోరు: 149-8

వికెట్ల పతనం: 12-1 (రోహిత్ శర్మ, 2.3), 39-2 (క్వింటన్ డీకాక్, 4.4), 81-3 (సూర్యకుమార్ యాదవ్, 11.1), 81-4 (కృనాల్ పాండ్యా, 11.4), 82-5 (సౌరబ్ తివారి, 12.1) 115-6 (ఇషాన్ కిషన్, 16.3), 116-7 (కౌల్టర్ నైల్, 17.2), 145-8 (పొలార్డ్, 19.3)

బౌలింగ్:
1. సందీప్ శర్మ 4-0-34-3
2. జాసన్ హోల్డర్ 4-0-25-2
3. షాబాజ్ నదీమ్ 4-0-19-2
4. టి. నటరాజన్ 4-0-38-0
5. రషీద్ ఖాన్ 4-0-32-1



Next Story

Most Viewed