‘రిలయన్స్’ సామ్రాజ్యం ఇప్పుడు వారి చేతుల్లోకి!

by  |
‘రిలయన్స్’ సామ్రాజ్యం ఇప్పుడు వారి చేతుల్లోకి!
X

ముంబయి: ప్రపంచంలోనే నాలుగవ ధనవంతుడు( fourth richest man in the world), ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) తన వ్యాపార సామ్రాజ్యానికి (business empire) సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. వారసత్వ ప్రక్రియ (Inheritance process)లో భాగంగా కుటుంబానికి చెందిన విస్తారమైన వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను కుటుంబంలోని ముగ్గురు సంతానానికి సమానంగా పంచడానికి సిద్ధమయ్యారు.

కొవిడ్-19 (kovid-19) లాంటి సంక్షోభ సమయంలోనూ తన వ్యాపార వ్యూహాలతో ముందుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ (Family Council) ఏర్పాటు చేయబోతున్నారనే విషయం వ్యాపార వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) పగ్గాలను చేపట్టేందుకు ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) సంతానమైన ఆకాశ్ అంబానీ (Aakash Ambani), ఇషా అంబానీ (Isha Ambani), అనంత్ అంబానీ (Anant Ambani) సహా కుటుంబ సభ్యులందరికీ కౌన్సిల్ సమాన ప్రాతినిధ్యం కల్పించనుందని, అయితే, ఈ అంశం అంతర్గతంగా ఉందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.

ఈ ప్రణాళికలో భాగంగా కుటుంబ పెద్దలతోపాటు, ముగ్గురు సంతానం, సలహాదారులు ఈ కౌన్సిల్‌లో ఉంటారు. 80 బిలియన్ డాలర్ల ($ 80 billion)కు పైగా విలువ ఉన్న ఆర్ఐఎల్ (RIL) విషయంలో ఈ కౌన్సిల్ ముఖ్య పాత్రను పోషించనుంది. కుటుంబంతోపాటు దాని వ్యాపారాలకు సంబంధించిన క్లిష్టమైన నిర్ణయాలను తీసుకోవడంలో కౌన్సిల్ (Council) సహాయపడుతుంది. 63 ఏళ్ల అంబానీ, వచ్చే ఏడాది చివరి నాటికి వారసత్వ ప్రణాళిక ప్రక్రియ (Inheritance planning process)ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

చరిత్ర పునరావృతం కాకుండా..

ఆర్ఐఎల్ (RIL) భవిష్యత్తు గురించి తన కుటుంబ భాగస్వామ్య దృష్టి ఉండేలా చూడాలని ముఖేశ్ భావిస్తున్నారు. తర్వాతి తరం బాధ్యతలను స్వీకరించినపుడు విభేదాలు ఏవైనా ఉంటే పరిష్కరించడానికి ఈ కౌన్సిల్ (Council) సహాయపడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే, 1973లో రిలయన్స్ స్థాపించిన ధీరూభాయ్ అంబానీ (Dhirubhai Ambani) మరణం అనంతరం ముఖేశ్ అంబానీ (Mukesh Ambani), అనిల్ అంబానీ (Anil Ambani) సోదరుల మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి పరిణామాలతో రిలయన్స్ సంస్థ (Reliance Company) చీలిపోయింది.

తమ తండ్రి ఆశయాలకు విరుద్ధమైన రీతిలో రెండు ముక్కలవడం, ఆ తర్వాతి పరిణామాలను పరిశీలించి ప్రస్తుతం ముందు జాగ్రత్త చర్యగా ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీనివల్ల అతిపెద్ద సంస్థ, విస్తారమైన రిలయన్స్ సంక్షోభం బారినపడకుండా రక్షించుకోవడమే కాకుండా, తండ్రిగానూ, కుటుంబ బాధ్యతలు కలిగిన వ్యక్తిగానూ ఇదివరకు జరిగినట్టు వారసుల మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండాలనే లక్ష్యంతోనే ముఖేశ్ అంబానీ ఈ ఆలోచన చేశారని మార్కెట్ నిపుణులు (Market experts) అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ అంశం గురించి అంతర్గతమైన చర్చలు నడుస్తున్నాయనే ఊహాగానాలపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు.

ముగ్గురికీ సమానంగా…

‘ఫ్యామిలీ కౌన్సిల్.. సంపన్న కుటుంబాలను, ముఖ్యంగా బహుళ తరాల కుటుంబాల్లో (multi-generational families) వ్యాపారాలకు సంబంధించి వివిధ విషయాలపై కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం చేయడానికి కార్యనిర్వాహక సంస్థగా పనిచేస్తుంది. ప్రస్తుతం అంబానీ కుటుంబంలో ముఖేశ్ అంబానీ ముగ్గురు సంతానం రిటైల్ (Retail), డిజిటల్ (Digital), ఎనర్జీ (Energy) రంగాలను ఎంచుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖేశ్ అంబానీ (Mukesh Ambani), నీతూ అంబానీ (Neetu Ambani) దంపతుల పిల్లలు ముగ్గురూ ఉన్నత విద్యను అభ్యసించారు. ఆకాశ్, అనంత్ అంబానీలు అమెరికాలో బ్రౌన్ విశ్వవిద్యాలయం (Brown University) నుంచి పట్టభద్రులు (Graduates) కాగా, ఇషా అంబానీ యేల్ విశ్వవిద్యాలయం (Yale University) నుంచి సైకాల్జీ, సౌత్ ఏషియన్ స్టడీస్(Psychology, South Asian Studies) చేశారు. ఇప్పటికే వ్యాపారంలోకి ప్రవేశించి తమ సత్తా చాటారు.

ఈ క్రమంలోనే 2014, అక్టోబర్‌లో ఇషా అంబానీ (Isha Ambani), ఆకాశ్ అంబానీ (Aakash Ambani) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్(Reliance Jio Infocomm Limited, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డు (Board of Reliance Retail Ventures Limited) లలో డైరెక్టర్లుగా చేరారు.

వీరిలో చిన్న వయస్కుడైన అనంత్ అంబానీ (Anant Ambani) ఈ ఏడాది మార్చిలో అదనపు డైరెక్టర్‌గా జియో ప్లాట్‌ఫామ్ బోర్డు (Jio Platform Board)లో నియమితులయ్యారు. ఇషా అంబానీ (Isha Ambani) ఇదివరకే రిలయన్స్ జియో ఫౌండేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌(Reliance Jio Foundation Institute of Education and Research) లో డైరెక్టర్‌గానూ ఉన్నారు.



Next Story

Most Viewed