ఎంఎస్ఎంఈ, వ్యవసాయ, రిటైల్ రుణాల్లో మెరుగైన వృద్ధి

by  |
ఎంఎస్ఎంఈ, వ్యవసాయ, రిటైల్ రుణాల్లో మెరుగైన వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో నెమ్మదిగా కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్న తరుణంలో ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణతో రుణ విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆర్‌బీఐ విడుదల చేసిన బ్యాంక్ క్రెడిట్ గణాంకాల ప్రకారం.. పెద్ద కార్పొరేట్‌లకు బ్యాంకు రుణాలు అందించడంలో గతం కంటే తగ్గిపోయాయి. అయినప్పటికీ ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం, రిటైల్ విభాగాలకు అందించే రుణాలు గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రుణాల వృద్ధి ఎక్కువగా ఉంది.

గతేడాది మార్చిలో కొవిడ్ మొదలైనప్పటి నుంచి పాత, కొత్త రుణాలపై వడ్డీ రేట్లు సైతం స్వల్పంగా 91 బేసిస్ పాయింట్ల నుంచి 80 పాయింట్లకు తగ్గడంతో ఈ వృద్ధి నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల రుణాలు గతేడాది జూలైలో 5.4 శాతం ఉండగా, ఈ ఏడాది 12.4 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో మధ్య తరహా పరిశ్రమలకు అత్యధికంగా 72 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఇవి 1.8 శాతం క్షీణించాయి. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 7.9 శాతం పెరిగింది. రిటైల్ రుణాలు గతేడాది 9 శాతం ఉండగా, ఈ ఏడాది 11.2 శాతం పెరిగాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, వాహనాలపై రుణాల పెరుగుదలతో ఈ వృద్ధి నమోదైంది. సమీక్షించిన సమయంలో బడా పరిశ్రమలకు ఇచ్చే రుణాల పెరుగుదల 2.9 శాతం తగ్గిపోయింది. ఇక, సేవల రంగంలో 12.2 శాతం వృద్ధి ఉన్నట్టు గణాంకాలు వెల్లడించాయి.



Next Story