విదేశీ పెట్టుబడుల నియంత్రణ విధానాలపై భారత్‌ను హెచ్చరించిన ఎంఎస్‌సీఐ

by  |
విదేశీ పెట్టుబడుల నియంత్రణ విధానాలపై భారత్‌ను హెచ్చరించిన ఎంఎస్‌సీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల పెట్టుబడులకు సూచీలను రూపొందించే ఎంఎస్‌సీఐ భారత్‌తో పాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను హెచ్చరించింది. విదేశీ పెట్టుబడులకు ఆటంకం కలిగించే, అంతర్జాతీయ పెట్టుబడి మార్గాలను నియంత్రించే కార్యకలాపాలకు చేపడితే సూచీలో రేటింగ్‌లను తగ్గిస్తామని తెలిపింది. భారత్, చైనా, కొరియా, బ్రెజిల్, టర్కీ దేశాల్లో విదేశీ పెట్టుబడులకు అవకాశాలు లేకుండా నియంత్రిస్తున్నట్టు ఆరోపించింది. ఎస్ఎం6సీఐ వెల్లడించే ఆసియా పసిఫిక్ ఎక్స్ జపాన్ సూచీ, ఎమర్జింగ్ మార్కెట్స్ సూచీలను అంతర్జాతీయ పెట్టుబడుల కంపెనీలు ప్రామాణికంగా పరిగణిస్తాయి.

ఈ క్రమంలో దేశీయంగానే కాకుండా, విదేశీ పెట్టుబడిదారులకు పెట్టుబడి అవకాశాలను అందుబాటులో ఉంచేందుకు స్థానిక స్టాక్ ఎక్స్ఛేంజీలను ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగానైనా నియంత్రణ ఉండకూడదని ఎంఎస్‌సీఐ తెలిపింది. అనుకోని పరిస్థితుల్లో ఎస్ఎస్‌సీఐ సంబంధిత దేశాల రేటింగ్‌ను తగ్గిస్తే విదేశీ పెట్టుబడుల రాకపై తీవ్రంగా ప్రభావం ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల జాబితాలో చైనా, భారత్, దక్షిణకొరియా దేశాలు ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed