టీమ్‌ఇండియా శిక్షణ శిబిరానికి ఎంఎస్ ధోనీ?

by  |
టీమ్‌ఇండియా శిక్షణ శిబిరానికి ఎంఎస్ ధోనీ?
X

దిశ, స్పోర్ట్స్: ధోనీ ఫ్యాన్స్‌కు శుభవార్త. వచ్చే నెలలో టీమ్‌ఇండియా సభ్యుల కోసం బీసీసీఐ నిర్వహించనున్న శిక్షణా శిబిరానికి ఎంఎస్ ధోనీ కూడా హాజరుకానున్నట్లు సమాచారం. కరోనా లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా క్రికెట్ స్తంభించింది. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలిస్తుండటంతో క్రికెటర్లకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనుంది. ఈ శిబిరానికి కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లే కాకుండా సెంట్రల్ కాంట్రాక్టు లేని వాళ్లను కూడా తీసుకు రావాలని బీసీసీఐ భావిస్తున్నది.

2019 వరల్డ్ కప్ తర్వాత ఎంఎస్ ధోనీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. టీమ్‌ఇండియాకు అందుబాటులో లేకపోవడంతో అతని సెంట్రల్ కాంట్రాక్టును కూడా బీసీసీఐ రద్దు చేసింది. కాగా, టీ20 వరల్డ్ కప్‌తో తన రిటైర్మెంట్ ప్రకటించాలని ధోనీ భావిస్తున్నాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. వరల్డ్ కప్ జరిగితే ధోనీనే కీపర్‌గా తొలి ప్రాధాన్యం అని కూడా బీసీసీఐ చెబుతున్నది. వరల్డ్ కప్ జరిగినా జరగకపోయినా ఈ సన్నాహక శిబిరానికి ధోనీని కూడా రప్పించాలని భావిస్తున్నట్లు మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు. ప్రాక్టీస్ కోసమే కాకుండా యువ వికెట్ కీపర్లకు దిశానిర్దేశం చేస్తాడని, ధోనీ వంటి సీనియర్లు శిబిరంలో ఉండాలని బీసీసీఐ భావిస్తున్నది.

Next Story

Most Viewed