ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చంద్రబాబు సంచలన నిర్ణయం

by  |
Chandrababu Naidu
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయించినట్లు తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి ముందుగా నోటిఫికేషన్ విడుదల చేశారని, రాజకీయ పార్టీలు ప్రజస్వామ్యాన్ని అవమానించారని అసహనం వ్యక్తంచేశారు. అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే.. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

కొత్త ఎలక్షన్ కమిషనర్‌గా నీలం సాహ్ని వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఏపీలో రాజ్యాంగ బద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదని, నిబంధనలు పక్కన పెట్టి మరీ ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. ఎన్నికలపై మంత్రులు ముందుగానే స్టేట్ మెంట్స్ ఇస్తున్నారని, ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థలను బలవంతంగా బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 2014లో 2శాతం ఎకగ్రీవాలపై 2020లో 24శాతం బలవంతపు ఏకగ్రీవాలు పెరిగాయని చంద్రబాబు విమర్శించారు. దీనిపై మాజీ ఎస్ ఈసీ గవర్నర్ కు లేఖ కూడా రాశారని గుర్తుచేశారు. ఇదిలాఉండగా ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5వరకు తొలి విడత.. ఏప్రిల్ 9వ తేదీన రీ పోలింగ్, ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నట్లు ఏపీ ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Next Story

Most Viewed