సీఎం జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘురామ

by  |
MP Raghu Ramakrishnam Raju
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రహదారులపై సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రహదారులపై సమీక్ష చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని అయితే రాజకీయం చేయడం మాత్రం సరికాదన్నారు. గత ప్రభుత్వం వల్లే రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం జగన్ నిత్యం ఫ్లైట్‌లలో తిరగడం కాదని…రోడ్లపై కూడా తిరగాలని సూచించారు. సీఎం చుట్టూ ఉన్నవారంతా ఆయనకు ప్రజల సమస్యలను చేరవేసేవారు కాదని.. పొగిడేవారని విమర్శించారు.

రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిరసనకు పిలుపునివ్వడం అభినందనీయమన్నారు. జ‌గ‌న్ ప్రభుత్వం రోడ్లను బాగు చేయిస్తే నేడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గానీ, నేనుగానీ, చంద్రబాబు గానీ ప్రభుత్వానికి చెప్పాల్సిన అవ‌స‌రం ఉండేది కాదని ర‌ఘురామ చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వ నేత‌లు మారాల‌ని.. మారుతార‌ని ఆశిస్తున్నా అన్నారు. మరోవైపు వినాయకచవితి ఉత్సవాలకు ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై ఎంపీ రఘురామ మండిపడ్డారు.


Next Story

Most Viewed