‘ట్యాపింగ్‌’ నిజమైతే జగన్ సర్కార్‌కు మూడినట్లే : ఆర్ఆర్ఆర్

by  |
‘ట్యాపింగ్‌’ నిజమైతే జగన్ సర్కార్‌కు మూడినట్లే : ఆర్ఆర్ఆర్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ రెబల్, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ ప్రభుత్వంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ దినపత్రిలో వచ్చిన ‘న్యాయదేవతపై నిఘా’ కథనంపై ఆయన స్పందించారు. ఏపీ ప్రభుత్వం ఫొన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నదని వస్తున్న ఆరోపణలు నిజమైతే జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. అంతేకాకుండా, తమ ఫోన్లు కూడా ట్యాపింగ్‌ అవుతున్నాయని ఆరోపించారు. న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ నిజమైతే.. ఏపీ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని ఆర్ఆర్ఆర్ డిమాండ్ చేశారు.

డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కౌంటర్..

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలకు రఘురామ కృష్ణరాజు కౌంటర్‌ ఇచ్చారు. ఎంపీ సీటు కోసం తాను ఎవరి కాళ్లు పట్టుకోలేదన్నారు. డిప్యూటీ సీఎం సంయమనం పాటించాలి. అమరావతి శిలాఫలకాల్లో తెలుగులో పేర్లు లేవన్న మేధావులు ఎక్కడికి వెళ్లిపోయారు’ అని నిలదీశారు.అంతకుముందు నారాయణస్వామి ఆర్ఆర్ఆర్‌పై మాట్లాడుతూ.. సీఎం జగన్ కాళ్లుపట్టుకుని టిక్కెట్ తెచ్చుకున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Next Story

Most Viewed