నేనంటే ఆ మంత్రికి భయం.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

by  |
MP Dharmapuri Arvind
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బంధువులు కాంట్రాక్ట్ తీసుకొని చేస్తోన్న చెక్ డ్యాంల నిర్మాణంలో ప్రణాళిక లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కేవలం కమీషన్‌ల కోసం చెక్ డ్యాంల ఎత్తు పెంచారని, దాని మూలంగానే భారీ వర్షాలకు చెక్ డ్యాంలు కొట్టుకుపోయి వందల ఎకరాలు నీటమునిగి, రైతులు నష్టపోయారని అన్నారు. శనివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం మోతే గ్రామంలో చెక్ డ్యాంలను ఎంపీ అర్వింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మోతే గ్రామాన్ని దత్తత తీసుకున్నా.. ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

వేల్పూర్ వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలను ముందుగా 8 మీటర్ల ఎత్తుతో నిర్మించారని, అనంతరం దానిని 4 మీటర్లు అదనంగా పెంచడంతో భారీ వర్షాలకు చెక్ డ్యాంలు తెగిపోయి ఇసుక కొట్టుకొచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.3 వేల పరిహారం ఇచ్చారని, వాటిని బ్యాంకు నుంచి తెచ్చుకునేందుకు తిరిగిన పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోలేదని ఎద్దేవా చేశారు. రైతులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసులతో బెదిరింపులకు గురిచేశారు. ఇవాళ తాను మోతే వస్తున్నానన్న విషయం తెలిసి మంత్రి తెగ భయపడి పోయాడని, ఆ భయం అలాగే ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. చెక్ డ్యాంలు తెగిపోయి జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు అని ప్రశ్నించారు. ఇరిగేషన్ ఏఈ ఇప్పటి వరకూ పంటను పరిశీలించలేదని మండిపడ్డారు.



Next Story

Most Viewed