MIM పార్టీకి కొత్త అర్థం చెప్పిన బండి సంజయ్

by  |
MIM పార్టీకి కొత్త అర్థం చెప్పిన బండి సంజయ్
X

దిశ, మహబూబాబాద్ : ఉగ్రవాదం.. గోవధ.. లవ్ జిహాద్.. హిందూ వ్యతిరేకత అన్ని కలగలిపినదే ఎంఐఎం పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడారు..

బీహార్ రాష్ట్రంలో 12 శాతం ఉన్న ముస్లింలు కేవలం వాళ్ళ మతం అని అక్కడ ఎలాంటి సంబంధం లేని ఎంఐఎంకు ఓటు వేసి ఐదు అసెంబ్లీ స్థానాలు గెలిపించారాని, అలాటింది 80 శాతాం హిందువులు ఉన్న భారత దేశ ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. హిందువులు ధర్మం, భారతీయ సనాతన ధర్మం కోసం పాటు పడే పార్టీ బీజేపీ అని అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం అవినీతి మాయం అయ్యిందన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు అయోధ్య రాముడి కోసం కొట్లాడలేదని,కేవలం బీజేపీ పార్టీ పోరాటం చేసిందని 4లక్షల మంది ప్రాణా త్యాగం చేశారని తెలిపారు. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తూ నిరుద్యోగులను,విద్యార్థులను మోసం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం కు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైనా గుణా పాఠం చెప్పాలని కోరారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని కేవలం మత మార్పిడి లకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టిఆర్ ఎస్ పార్టీ ఎంఐఎం తో పొత్తు పెట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్,గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, రామచందర్ రావు , అశోక్ రెడ్డి,ఎల్ది మల్లయ్య,సీతయ్య,నరేశ్,సంపత్, మదన్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed