ఢిల్లీకి చేరిన తీన్మార్ మల్లన్న.. ఎంపీ అర్వింద్ నివాసంలో ‘ములాఖాత్’

235

దిశ, వెబ్‌డెస్క్ : తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈనెల 7వ తేదిన కేంద్రంలోని కాషాయ పార్టీ పెద్దల సమక్ష్యంలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న ఒకరోజు ముందే (సోమవారం) దేశరాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అధికారిక నివాసంలో ఇద్దరూ ములాఖాత్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ అర్వింద్ తన ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు.

‘ఢిల్లీలోని నా నివాసంలో ప్రముఖ జర్నలిస్టు, తీన్మార్ మల్లన్నతో’ అని తెలుగులో రాసుకొచ్చిన ఆయన ‘సీఎం కేసీఆర్‌కు గుచ్చుకున్న పదునైన ముళ్లు తీన్మార్ మల్లన్న’.. అని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. అంతేకాకుండా మల్లన్నతో కలిసి దిగిన సెల్ఫీని ఈ పోస్టుకు జతచేశారు. ఇదిలాఉండగా తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతుండటంతో కాషాయ పార్టీ కార్యకర్తలు, అభిమానులు గ్రాండ్ వెలకమ్ చెబుతున్నారు.