ట్రోలర్స్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన యంగ్ హీరో

by Hamsa |
ట్రోలర్స్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన యంగ్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'SR కళ్యాణమండపం' చిత్రంతో విజయం సాధించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా, 'వినరో భాగ్యమ విష్ణుకథ'తో వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా, తనపై కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారని కిరణ్ అబ్బవరం తెలుపుతూ వారికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.

' ఓ వర్గం ప్రత్యేకంగా కొత్త నటీనటులను లక్ష్యంగా చేసుకుని, మా కెరీర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. నా మునుపటి సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు నాపై వచ్చిన విమర్శలను నేను స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ, 'వినరో భాగ్యమ విష్ణు కథ' మూవీ పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్నా.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నన్ను టార్గెట్ చేస్తే మీకేం వస్తుంది? అంటూ ఫైర్ అయ్యాడు.

Next Story

Most Viewed