పవన్ కళ్యాణ్‌తో మూవీ చేయబోతున్న మరో యంగ్ డైరెక్టర్

by Hamsa |
పవన్ కళ్యాణ్‌తో మూవీ చేయబోతున్న మరో యంగ్ డైరెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టి షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా, పవన్ కళ్యాణ్ మరో యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. సుధీర్ వర్మ ఇప్పుడు హీరో ర‌వితేజతో రావ‌ణాసుర అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పవన్ కళ్యాణ్‌‌తో సినిమా చేయబోతున్నట్లు స్వయంగా సుధీర్ వెల్లడించాడు. ‘‘ నేను గతంలో తీసిన మూవీ కేశవ త్రివిక్రమ్‌కు నచ్చింది. ఇటీవల డైరెక్టర్ త్రివిక్రమ్ పవర్‌ఫుల్ కథను నాకు చెప్పి, పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలన్నారు. ఎప్పుడు మూవీ ఉంటుందనేది త్వరలో తెలియజేస్తాం’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప‌వ‌న్ కళ్యాణ్ త‌న సినిమాల‌కు డేట్స్‌ను కేటాయిస్తూ, రాజకీయాలను చూసుకుంటూ ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. మ‌రిప్పుడు సుధీర్ వ‌ర్మతో సినిమా ఎప్పుడు ఉంటుంద‌నేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read..

Mega Heroes: కోలీవుడ్ వైపు చూస్తున్న మెగా ఫ్యామిలీ? ఎందుకో తెలుసా?

Next Story

Most Viewed