ఇది ఇస్లాం కాదు.. తీవ్రవాదం: ‘ది కేరళ స్టోరీ’ ఇష్యూపై బిహానీ

by Dishanational2 |
ఇది ఇస్లాం కాదు.. తీవ్రవాదం: ‘ది కేరళ స్టోరీ’ ఇష్యూపై బిహానీ
X

దిశ, సినిమా : ‘ది కేరళ స్టోరీ’ని ప్రాపగండా ఫిల్మ్ అని పిలవడంపై యోగితా బిహానీ రియాక్ట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆమె.. మూవీ విడుదలకు ముందే విషప్రచారం చేయడం నచ్చలేదని చెప్పింది. నిజానికి ఈ చిత్రం సమాజంలోని ఒక వర్గానిదే అని చెప్పడం సరైనది కాదన్న నటి.. ‘విపుల్ సార్ చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నా. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాం. దీనికి అందరి మద్దతు కావాలి. ఇందులో క్రిస్టియన్, హిందూ అమ్మాయిని కూడా చూపించాం. ఇది మంచి సబ్జెక్ట్ కాబట్టి అన్ని చోట్లా ప్రసారం కావాలి. దీన్ని వ్యతిరేకించేవాళ్లు ఒకసారి ఆలోచించాలి. ఇది కేవలం మహిళల భద్రత గురించి మాత్రమే కాదు.. పురుషులను కూడా సమూలంగా మార్చేస్తున్నారు. ఇది ఇస్లాం కాదు తీవ్రవాదం’ అని చెప్పుకొచ్చింది. చివరగా ఇందులో తన నటనకు తల్లిదండ్రులు, కుటుంబసభ్యలు, స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకున్నానంటూ మురిసిపోయింది.

Next Story

Most Viewed