ప్రభాస్‌‌ను అనుష్కను కలిపేందుకు భారీ స్కెచ్ వేసిన ఆ స్టార్ హీరో.. అతను ఎవరంటే?

by Disha Web Desk 10 |
ప్రభాస్‌‌ను అనుష్కను కలిపేందుకు  భారీ స్కెచ్ వేసిన ఆ స్టార్ హీరో.. అతను ఎవరంటే?
X

దిశ, సినిమా: రెబల్ యంగ్ స్టార్ ప్రభాస్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది అనుష్క. ఈ జంట చాలా ఫేమస్ అయ్యారు. ప్రభాస్-అనుష్క జోడీ స్క్రీన్ ప్రెజెన్స్ కి యూత్ ఫిదా అయిపోయారు. ఇద్దరు మంచి స్నేహితులు.. ఈ జంట ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోటోలు తీసి సోషల మీడియాలో పెడుతుంటారు. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ చర్చలు జరుగుగుతున్నాయి.

వారిద్దరూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కావడంతో, వారి పెళ్లి గురించి పై ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అనుష్కని ప్ర‌భాస్‌ భార్య‌గా చేయాల‌ని మంచు విష్ణు తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రహస్యంగా ఉంచిన ఈ విషయం ఇప్పుడు బయట పడింది. అదేంటో ఇక్కడ చూద్దాం..

పెళ్లి చేసుకోకపోయినా పెళ్లయిన సెలబ్రిటీ కపుల్స్ కంటే ప్రభాస్-అనుష్క అంటే అంత క్రేజ్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ జంట పేరు బాగా వినిపిస్తోంది. ఈ ఇద్దరిని భార్యాభర్తలుగా మంచు విష్ణు చేయనున్నారని తెలుస్తుంది. విష్ణు పక్కా ప్లాన్ తో ఇద్దరి అభిమానులను సర్ ప్రైజ్ చేయనున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుందనేది హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం మంచు విష్ణు అని అంటున్నారు. ప్రభాస్-అనుష్క జంటతో కలిసి మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కోసం ప్లాన్స్ చేస్తున్నాడని సమాచారం.


Next Story

Most Viewed