అలాంటి అబ్బాయి కావాలి.. హెబ్బా పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hamsa |
అలాంటి అబ్బాయి కావాలి.. హెబ్బా పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ 'కుమారి21f' తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే తన అందచందాలతో ప్రేక్షకుల మనస్సు దోచేసింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. హెబ్బా పటేల్ తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లిపై ఆసక్తికర విషయాలు చెప్పింది. హెబ్బా మాట్లాడుతూ '' గతంలో నేను కూడా డేటింగ్ చేశాను. ఆ అబ్బాయి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. అయితే తొలి సినిమా విడుదలకు ముందే బ్రేక్ అయ్యింది. ఆ సినిమాలో బిజీ కావడంతో బ్రేకప్ గురించి ఎక్కువ ఆలోచించ లేదు. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను'' అంటూ చెప్పుకొచ్చింది.

తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో అని ప్రశ్నించగా.. 'నేను ఊరికే ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. అందుకే తక్కువ మాట్లాడే అబ్బాయి కావాలి. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉండాలి. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అస్సలు ఉండకూడదు. నన్ను ప్రేమగా చూసుకోవాలి' అని తెలిపింది.

'సీతారామం' సినిమాకు సరికొత్త రికార్డు

Next Story

Most Viewed