డార్లింగ్ ప్రభాస్‌కు గిఫ్ట్ పంపిన వేణుస్వామి భార్య.. పబ్లిసిటీ స్టంట్ అంటూ నెట్టింట రచ్చ..?

by Disha Web Desk 7 |
డార్లింగ్ ప్రభాస్‌కు గిఫ్ట్ పంపిన వేణుస్వామి భార్య.. పబ్లిసిటీ స్టంట్ అంటూ నెట్టింట రచ్చ..?
X

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరికి తెలిసిందే. నటీనటులపై, రాజకీయవేత్తలపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. అలాగే వేణు స్వామి సతీమణి వీణ శ్రీవాణికి కూడా నెట్టింట ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణతో వాయించడంలో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె.. తాజాగా డార్లింగ్ ప్రభాస్‌కు ఓ గిఫ్ట్ పంపిస్తున్నట్లు వీడియో షేర్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘మా ఇంటికి వచ్చే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అందరికి పంచడం మాకు అలవాటు. అదే రీతిలో కొన్ని డేస్ క్రితం ఈ స్పెషల్ సీతా ఫలాలు అందరికి పంచుకుంటూ ఒక స్పెషల్ పర్శన్ దగ్గరికి వెళ్లాయి. అక్కడ నుంచి మన డార్లింగ్ ప్రభాస్ వద్దకు వెళ్లాయి. ఆయన ఇవి చాలా బాగున్నాయి.. మరిన్ని పంపించండి అని అడిగారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అడిగితే పంపించమా.. ఈరోజు పంపిస్తున్నాను. ఈ పంటే లాస్ట్.. ఎవరికి పెట్టకండి. మీరే తినేయ్యండి. మళ్లీ సీజన్‌లో ఎక్కువ పంపిస్తాను అప్పుడు పంచిపెట్టడండి. అలాగే ఇది నా క్యూట్ గిప్ట్ మీ కోసం. హాండ్ మేడ్, కస్టమైడ్, ఆర్గానిక్ బ్యాగ్. మీరు షూటింగ్స్‌కు వెళ్లేటప్పుడు ఇందులో ఫ్రూట్స్ పట్టుకుని వెళ్లండి. ఆరోగ్యానికి మంచిది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ‘ప్రభాస్ అన్నా ఫ్యాన్స్.. మీ భర్తను వేసుకుంటున్నారు కదా.. అందుకే పబ్లిసిటీ స్టంట్ చేస్తు్న్నావా’ అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


Next Story

Most Viewed