స్టేజ్ మీద నుంచి ఉపాసనకు సైగలు చేస్తోన్న చరణ్.. కోడ్ భాషలో మాట్లాడుతోన్న క్యూట్ వీడియో వైరల్

by Disha Web Desk 9 |
స్టేజ్ మీద నుంచి ఉపాసనకు సైగలు చేస్తోన్న చరణ్.. కోడ్ భాషలో మాట్లాడుతోన్న క్యూట్ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్‌గా పేరు సంపాదించుకున్న వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ఒకరు. అపోలో ఆసుపత్రి చైర్మన్ అయిన ఉపాసనను చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు వీరి పెళ్లైన పదేళ్లకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో అంతా మంచి జరుగుతుందని అభిమానులు సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రీసెంట్‌గా చెన్నైలోని వేల్స్ యూనివర్సీటీలో డాక్టరేట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ఉపాసన కూడా హాజరై తెగ సందడి చేసింది.

చరణ్ డాక్టరేట్ అందుకున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ కార్యక్రమం నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చరణ్ స్టేజ్ మీద కూర్చుని.. స్టేజ్ కు అపోజిట్ గా ఆడియన్స్‌లో కూర్చున్న ఉపాసనకు సైగలు చేస్తున్నారు. దీనికి ఉపాసన కూడా నోటి సైగలతో సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ‘క్యూట్ కపుల్’ అంటూ మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్-ఉపాసన మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed