'ఏజెంట్' టీజర్‌పై ట్రోల్స్.. అఖిల్ సినిమా హిట్టా..? ఫట్టా..?

by Disha Web Desk 7 |
ఏజెంట్ టీజర్‌పై ట్రోల్స్.. అఖిల్ సినిమా హిట్టా..? ఫట్టా..?
X

దిశ, వెడ్‌డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా, డైరెక్టర్ సరేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'ఏజెంట్'. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను మొదట సంక్రాంతికి సందర్భంగా రిలీజ్ చేద్దామనుకున్నారు మేకర్స్. అయితే.. ఆ సమయంలో అనేక సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో కాస్త గ్యాప్ తీసుకున్నారు. తాజాగా సినిమా డేట్ రివీల్ చేస్తూ చిత్ర బృందం ఓ టీజర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. ఈ వీడియో చూసిన వారు సినిమాపై నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. ''టీజర్‌లో అఖిల్ లుక్ దారుణంగా ఉంది.. షారూఖ్ ఖాన్ అట్లీ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ల అనిపించింది.. రక్తంతో పూర్తిగా నిండిన అఖిల్ లుక్ అంతగా ఆకట్టుకోలేక పోయింది'' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏమైనప్పటికీ 'ఏజెంట్' మూవీ ట్రీజర్ అనుకున్నంత హిట్ టాక్ దక్కించుకోలేక పోయిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 28 న అనేక భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది.

Read more:

జైలర్ నుంచి సాలీడ్ అప్‌డేట్స్


Next Story

Most Viewed