"జైలర్" నుంచి సాలీడ్ అప్‌డేట్స్

by Disha Web Desk 10 |
జైలర్ నుంచి సాలీడ్ అప్‌డేట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం "జైలర్". దాదాపు షూటింగ్ కంప్లీట్ కావస్తుండటంతో సినిమా నుంచి ఒక్కో అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఆ మధ్య తమన్నా, సునీల్, మోహన్‌లాల్ శివన్నల ఫస్ట్ లుక్‌ని రివీల్ చేయగా.. తాజాగా కీలక పాత్రలో పోషిస్తున్న బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా కాలం తర్వాత రజినీకాంత్‌‌కు జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారు. మొత్తానికి యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌తో ఈ మూవీ ఏప్రిల్14న థియేటర్లలోకి రాబోతోంది.


Next Story

Most Viewed