స్టార్ హీరోతో లిఫ్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన త్రిష.. ఫొటోలు వైరల్

by sudharani |
స్టార్ హీరోతో లిఫ్ట్‌లో అడ్డంగా దొరికిపోయిన త్రిష.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుకుంటుంది. ‘పొన్నియన్ సెల్వన్’ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత విజయ్ ‘లియో’తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలైనా.. ఇప్పటికీ తన అందం, అభినయంతో మెప్పిస్తూ.. ప్రజెంట్ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ప్రస్తుతం ‘ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సైంటిఫిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజైన విషయం తెలిసిందే.

అయితే.. వెండితెరపై త్రిష, విజయ్‌లా కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే చాలా చిత్రాల్లో నటించారు. వీళ్ల కెమిస్ట్రీకి స్పెషల్ ఫ్యాన్స్ బేస్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల ‘లియో’ మూవీలో కలిసి నటించిన ఈ జంటకు సంబంధించిన ఓ పిక్ తాజాగా నెట్టింట వైరల్ అవుతుంది. ఓ లిఫ్ట్‌లో విజయ్, త్రిష మాత్రమే ఉన్నారు. ఈ ఫొటోను ఓ వ్యక్తి తన X ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ‘#తలపతివిజయ్, #త్రిష యొక్క సాధారణ చిత్రం. కానీ వారి మధ్య కెమిస్ట్రీ ఫైరింగ్‌గా ఉంటుంది’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇందులో వీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది తెలియలేదు కానీ.. తాజా స్టిల్‌లో మాత్రం ఫ్రెష్‌ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు విజయ్ & త్రిష.
ఇక్కడ క్లిక్ చేయండి: ట్రెండీ లుక్‌లో యంగ్ హీరోయిన్.. యాపిల్ బ్యూటీ అంటున్న నెటిజన్లు
Next Story

Most Viewed