ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో అల్లు రమేష్ మృతి

by Disha Web Desk 6 |
ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో అల్లు రమేష్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుండి టాలీవుడ్‌లో వరుస విషాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ప్రముఖ కమెడియన్ అల్లు రమేష్ తుది శ్వాస విడిచారు. వైజాగ్‌లో ఉంటున్న ఆయన గుండెపోటుతో మరణించినట్టు సమాచారం. దీంతో ప్రముఖ డైరెక్టర్ ఆనంద్ రవి తన ఫేస్ బుక్‌ పోస్ట్‌తో సంతాపం తెలిపాడు. ‘‘మొదటి రోజు నుండి మీరు నాకు అతిపెద్ద మద్దతుగా ఉన్నారు. ఇప్పటికీ నా మైండ్‌లో నీ మాటలు వినిపిస్తున్నాయి.

రమేష్ గారు, మీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. మీరు నా లాంటి చాలా మంది హృదయాలను హత్తుకున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాను ఓం శాంతి’’ అంటూ రాసుకొచ్చాడు. అల్లు రమేష్ మొదట నాటకాలలో నటించారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ప్రస్తుతం యూట్యూబ్‌లో ప్రసారమవుతున్న ‘మా విడాకులు’ వెబ్ సిరీస్‌లో మామగా నటించారు.

Also Read..

రాజమౌళి కొడుకు హీరో కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

Next Story

Most Viewed