డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నఅంటూ ఎమోషనల్ పోస్ట్

by Disha Web Desk 7 |
డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నఅంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన వదిన చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని నేరుగా ఆయన తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు.. ‘వదినా నిన్ను చాలా మిస్ అవుతున్నాం.. ఇంత బాధను భరించి ఇంకా బలంగా నిలబడ్డావు! మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు.. అంతే కాకుండా మీరు ఎల్లప్పుడూ పాజిటివ్ మనస్తత్వాన్ని కలిగి ఉండేవారు. మీరు చనిపోయారనే విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను.. మీరు ఇప్పుడు స్వర్గంలో ఉంటారని ఆశిస్తున్నాను.. మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు.. ఓం శాంతి’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. సోషల్ మీడియా వేదికగా నటీనటులు, ఫ్యాన్స్ తదితరులు ధైర్యం చెబుతున్నారు.


Next Story

Most Viewed