ఈ సెప్టెంబర్‌కు థియేటర్స్‌లో బ్యాక్ టు బ్యాక్ తెలుగు మూవీస్

by sudharani |
ఈ సెప్టెంబర్‌కు థియేటర్స్‌లో బ్యాక్ టు బ్యాక్ తెలుగు మూవీస్
X

దిశ, సినిమా: సాధారణంగా వినాయక చవితి, దసరా, సంక్రాంతి వంటి పండుగలు ఉంటే తప్ప పెద్ద సినిమాల విడుదల ఉండదు. ఇక సెప్టెంబర్‌లో కొత్త చిత్రాల విడుదల చాలా తక్కువ. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రతివారం ఒక పెద్ద మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. శివ నిర్వహణ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’.. సెప్టెంబర్ 1న విడుదల కానుంది. అలాగే నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న ‘NBK 108’ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

చివరగా ప్రభాస్ నటించిన ‘సలార్’ కోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక మొత్తానికి సెప్టెంబర్ నెలలో బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా భారీ చిత్రాలు రిలీజ్ అవుతుండగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో లేదో చూడాలి మరి.

Advertisement

Next Story