Arijit Singh: నేడు సింగర్ అరిజిత్ సింగ్ పుట్టినరోజు

by Disha Web Desk 10 |
Arijit Singh:  నేడు సింగర్ అరిజిత్ సింగ్ పుట్టినరోజు
X

దిశ, సినిమా: సింగర్ అరిజిత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పాటలతో యువతను నవ్వించగలడు అలాగే ఏడిపించగలడు. అతని పాటలు మన మనసును టచ్ చేస్తాయి. అరిజిత్ సింగ్ పాడిన ఏ పాట అయినా.. అది నిముషాల్లోనే వైరల్ అవుతుంది. పాటలు పాడటం మాత్రమే కాకుండా సంగీతాన్ని కూడా సినిమాలకి అందించాడు. మెలోడీల నుండి ఎనర్జిటిక్ గా మారే మ్యాజిక్ అతనికి మాత్రమే తెలుసు. అతను రియాలిటీ షో ఫేమ్ గురుకుల్‌లో కనిపించారు. ఆ తర్వాత 2011లో మర్డర్ 2 చిత్రం నుండి "ఫిర్ మొహబ్బత్" పాటతో తన అరంగేట్రం చేసాడు.

అరిజిత్ బాలీవుడ్ పాటలే కాకుండా బెంగాలీ, మరాఠీ, కన్నడ, అస్సామీ, గుజరాతీ మొదలైన ఇతర భాషలలో కూడా చాలా పాటలు పాడారు. నేడు తన 36 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.



Next Story

Most Viewed