‘రజాకార్’ నిర్మాతకు బెదిరింపు కాల్స్.. సెక్యూరిటీ పెంచిన కేంద్రం

by Disha Web Desk 2 |
‘రజాకార్’ నిర్మాతకు బెదిరింపు కాల్స్.. సెక్యూరిటీ పెంచిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: విడుదలకు ముందే రజాకార్ సినిమా ఎదుర్కొన్న వివాదాలు అన్ని ఇన్నీ కావు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే విడుదలకు సిద్ధమైనా కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. తాజాగా.. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ చిత్రాన్ని విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఇది పాజిటివ్ టాక్‌తో థియేటర్స్‌లో మంచి వసూళ్లనే సాధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిత్రబృందానికి అనూహ్య పరిణామం ఎదురైంది. చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది.

‘రజాకార్ సినిమా’ ప్రదర్శన చేస్తున్నందుకు గూడూరు నారాయణ రెడ్డికి దాదాపు 1100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆయనకు 1+1 CRPF జవాన్‌లను భద్రత నిమిత్తం కేటాయించింది. కాగా, నిజాం రాక్షస పాలనకు వ్యతిరేకంగా నాడు ప్రజలు చేసిన పోరాటాన్ని గూడూరు నారాయణ రెడ్డి సినిమాగా రూపొందించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించింది.



Next Story

Most Viewed