ఒక్క ముద్దు కోసం ఆరాటపడి.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన నటీనటులు వీళ్లే..

by Disha Web Desk 7 |
ఒక్క ముద్దు కోసం ఆరాటపడి.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన నటీనటులు వీళ్లే..
X

దిశ, సినిమా: పలకరింపులు ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే ముద్దు, హగ్‌లతోనే హాయ్, బై చెప్పేసుకుంటారు. అయితే అది కొన్ని సమయాల్లో మితిమీరితే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న నటీనటుల గురించి చూద్దాం.

రేఖ - హృతిక్ రోషన్:

2003లో వచ్చిన ‘కోయి మిల్ గయా’ మూవీలో తల్లి,కొడుకులుగా నటించిన రేఖ, హృతిక్ ఒక అవార్డు ఫంక్షన్‌లో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత రేఖ ఆప్యాయంగా అతని చెంపపై ముద్దు పెట్టుకోవాలనుకున్నప్పటకీ అది కాస్తా స్లిప్ అయి.. పెదవుల కింద ముద్దు పెట్టేసింది. హృతిక్ ఆమె ముక్కుపై కిస్ చేశాడు. ఇక ఈ మూమెంట్ కెమెరాకు చిక్కడంతో వీరిద్దరి‌పై దారుణంగా ట్రోల్స్ జరిగాయి.

దీపికా పదుకొణె-సిద్ధార్థ్ మాల్యా :

2013లో ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరైనప్పుడు పలకరింపులో భాగంగా దీపిక, సిద్ధార్థ్ మాల్యా లిప్ కిస్ పెట్టుకున్నారు. దీంతో అది చాలా ఫేమస్ అయిపోయింది.

పూజా భట్-మహేష్ భట్ :

నిజానికి వీరిద్దరు తండ్రీకూతుళ్లు. కానీ ఒక మ్యాగజైన్ కవర్ కోసం లిప్ లాక్ పెట్టుకున్నారు. అప్పట్లో అది భారీ ప్రకంపనలు సృష్టించింది. అంతేకాదు పూజా భట్ తన కుమార్తె కాకపోయుంటే ఆమెను వివాహం చేసుకునే వాడిని మీడియా ముఖంగా ఓపెన్‌గా చెప్పాడు మహేష్ భట్.

రాఖీ సావంత్-మికా సింగ్ :

బాలీవుడ్‌లో వివాదాస్పద ముద్దుల లిస్ట్‌లో రాఖీ, మికా ముందు వరుసలో ఉంటారు. 2006లో మికా పుట్టినరోజు వేడుకల్లో.. రాఖీ అనుమతి లేకుండా కెమెరాల ముందు బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. అనంతరం..‘ ఆమె నా ముఖానికి కేక్ పూయడం ఆపలేదు కాబట్టి ఆమెకు గుణపాఠం చెప్పేందుకే అలా చేశాను. అలా చేయవద్దని ముందే హెచ్చరించిన వినలేదు’ అని తెలిపాడు. దీంతో ఆశ్చర్యపోయిన రాఖీ అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో మికాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటికీ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.

శిల్పాశెట్టి-రిచర్డ్ గేర్ :

వీరిద్దరు రాజస్థాన్‌లో ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న క్రమంలో శిల్ప బుగ్గలపై ప్లాటోనిక్ ముద్దు పెట్టాడు రిచర్డ్. అది చాలా పెద్ద సీన్ అయింది. వారి అసభ్యకరమైన ప్రవర్తనకు ప్రజలు ఆగ్రహం చెందడమే కాకుండా, భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు దాదాపు 15 ఏళ్లు పట్టింది.



Next Story

Most Viewed